భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక ఎవరున్నరు?

భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక ఎవరున్నరు?
  • అమోయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ఎలాంటి ఆదేశాలు ఇచ్చేవారు
  • మహేశ్వరం అప్పటి ఆర్డీవో వెంకటాచారిని ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌‌‌‌‌‌‌‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్స్ కేసులో అప్పటి ఆర్డీవో వెంకటాచారిని ఈడీ అధికారులు విచారించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నించారు. ఈ కేసులో కలెక్టర్ అమోయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతి ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈడీ సమన్ల మేరకు వెంకటాచారి గురువారం ఉదయం ఈడీ ఆఫీసుకు వచ్చారు. ఈడీ అధికారులు అడిగిన ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రికార్డులను, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లను అధికారులకు అందించాడు.

నాగారం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 181లో గల 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించిన వివరాలతో ఈడీ అధికారులు స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమోయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే మూడు రోజులు ప్రశ్నించారు. ఈ ఇద్దరు అధికారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే మాజీ ఆర్డీవో వెంకటాచారిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.

కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన సమయంలో అమోయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవని, అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేవారా, ఓరల్ ఆర్డర్స్ ఇచ్చేవారా? అనే వివరాలతో పాటు నోటిఫై ఫైల్స్‌‌‌‌‌‌‌‌ గురించి ఆరా తీసినట్లు సమాచారం. ధరణితో పాటు భూ కుంభకోణానికి సంబంధించి ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే వివరాలను సేకరించినట్లు తెలిసింది. మరోసారి విచారణకు హాజరుకావాలని వెంకటాచారిని ఈడీ ఆదేశించింది.