ఘనంగా తిరుమలనాథుని రథోత్సవం

ఘనంగా తిరుమలనాథుని రథోత్సవం

చిట్యాల, వెలుగు: మండలంలోని పెద్దకాపర్తిలో  భూదేవి సమేత తిరుమలనాథస్వామి రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామివారిని రథంపై ప్రతిష్ఠించగా, భక్తులు తాడుతో లాగారు.  కొండపైన స్వామి వారిని ఊరేగించారు. అనంతరం ఆలయానికి తీసుకెళ్లారు. 

పెద్దకాపర్తి, ఆరెగూడెం కు చెందిన 1997-–98 బ్యాచ్​ పదోతరగతి విద్యార్థులు వెండి  కిరీటాలను ఆలయ కమిటీ చైర్మన్ ఓర్సు రాజ్ కుమార్ సమక్షంలో అర్చకుడు సాగి శైలేంద్ర శర్మ చేతులమీదుగా  దేవతామూర్తులకు అలంకరింపజేశారు.  అనంతరం కల్యాణం వైభవంగా జరిపించారు. పూర్వ విద్యార్థులు డా.నూతి శ్రీను, సుధాకర్, ధనుంజయ, పురుషోత్తం, సిలివేరు శ్రీను, స్వామి, పాలది శ్రీను, జెల్లా హరికృష్ణ, భాగ్యలక్ష్మి, ఆండాలు, స్వప్న, యశోద, అరుణ, సరిత పాల్గొన్నారు.