కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి : జాన్సన్​నాయక్

జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలో ఈ నెల 17న మంత్రి కేటీఆర్ పాల్గొనే ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్ కోరారు. కేటీఆర్ హజరయ్యే బహిరంగ సభా స్థలాన్ని పార్టీ సీనియర్ నాయకులు పైడిపెల్లి రవీందర్ రావుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. 

నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో  ప్రజలు తరలివచ్చే ఆవకాశమున్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మాదాడి సరోజన, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, పెంబి జడ్పీటీసీ జానుబాయి, పార్టీ నాయకులు భరత్ కుమార్, ఫజల్ ఖాన్, మున్వర్ ఆలీఖాన్, జనార్దన్, మండలంలోని ప్రజాప్రతి నిధులున్నారు. 

జాన్సన్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించండి..

ఖానాపూర్: ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని  బీఆర్ఎస్ నాయకులు కోరారు. గురువారం ఖానాపూర్ తోపాటు పలు గ్రామాలు, కడెం ఉమ్మడి మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు ఇంటింట ప్రచారం చేపట్టారు. తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థించారు. 

ప్రజలను మరోసారి మభ్య పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. జాన్సన్ నాయక్ గెలిస్తే అభివృద్ధిలో నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉంటుందన్నారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజేందర్, ఖలీల్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రాజా గంగన్న, పరిమి సురేశ్, నాయకులు నజీర్, ఇర్ఫాన్, ప్రదీప్, కావలి సంతు, నారాయణ, రాజు, ఫైసల్, వాసేఖాన్ తదితరులు ఉన్నారు.

ALSO READ: ముస్లింలకు హోం మంత్రి మహమూద్ అలీ క్షమాపణలు చెప్పాలి

బీఆర్ఎస్ లో చేరికలు

ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీలో చేరుతున్నారని జాన్సన్ నాయక్ అన్నారు. ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ దొనికేని చిన్నయ్య, మాజీ ఎంపీటీసీ ఎండీ జమీల్ తో పాటు పలువురు జాన్సన్ నాయక్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.