హుజూర్ నగర్, వెలుగు: మఠంపల్లి మండలం రఘునాధపాలెంలోని శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు భూక్యా మంజీ నాయక్ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వడ్డెరలు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, వైశ్యులు దహన సంస్కారాలు నిర్వహిస్తున్న శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.
విచారణ జరిపి శ్మశాన వాటికకు హద్దులు నిర్ణయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి శ్రీనివాస్, యాదగిరి, కోటయ్య, వెంకటనారాయణ, బాబు, బాలశౌరి, రమేశ్, బాలకృష్ణ, చెన్నయ్య, రాజేశ్, మహేశ్, జయప్ప తదితరులు పాల్గొన్నారు.