
అవధూత కాశిరెడ్డి నాయన అన్నదాన సత్రం కూల్చివేత ఏపీలో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 30 ఏళ్లుగా ఎంతోమంది ఆకలి తీర్చుతున్న నిత్యాన్నదాన సత్రానికి సంబంధించిన నిర్మాణాలను కూల్చేయడంతో హిందూ సంఘాలు, కాశినాయన భక్తులు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మంత్రి లోకేష్ స్పందించి సత్రాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇవ్వటంతో వివాదం సద్దుమనిగింది. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై స్పందించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య వైరుధ్యాల వల్ల రాష్ట్రం నష్టపోతుందని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు భద్రత లేదని.. సనాతన ధర్మానికి రక్షణ లేదు అన్నారు భూమన. కాశీనాయన క్షేత్రంపై దాడిని వైసీపీ ఖండిస్తోందని అన్నారు.కూటమి ప్రభుత్వంలో ఉండడంవల్లే బీజేపీ నోరుమెదపడంలేదని మండిపడ్డారు.రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని అన్నారు భూమన.
Also Read:-శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్: ఫేక్ వెబ్సైట్లతో జాగ్రత్త..!
పవన్ కళ్యాణ్, లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్‌లతో బద్దలుకొట్టడమేనని అన్నారు. గతంలో తొక్కిసలాటలో ఆరుగురు చనిపోతే ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు భూమన.