జ్యోతినగర్, వెలుగు: రామగుండం బీ పవర్‌హౌజ్ గడ్డపై ఏర్పాటు చేయనున్న 150 అడుగుల పంచముఖ వీరాంజనేయ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్–మనాలి ఠాకూర్ దంపతులు మంగళవారం భూమిపూజ చేశారు. ఇటీవల ఈ ప్రాంతంలో కోదండ వీరాంజనేయ విగ్రహం దొరికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 ఏండ్ల చరిత్ర ఉన్న వీరాంజనేయ విగ్రహం ఇక్కడ లభించడం శుభపరిణామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్ పాష, దీటీ బాలరాజు, కుసుమ వెంకటేశ్, గొడుగు శ్రీనివాస్, పాల్గొన్నారు.
గోదావరిఖని, వెలుగు: శాంతిమార్గం చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు అని, ఆయన అనుగ్రహం అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. మంగళవారం గోదావరిఖని బృందావన్ గార్డెన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఏసీపీ ఎం.రమేశ్, తహసీల్దార్లు కుమారస్వామి, రవీందర్, కార్పొరేటర్లు, సీనియర్ లీడర్లు పాల్గొన్నారు.