మందమర్రి పట్టణంలో కార్మికవాడల్లో బీటీ రోడ్ల పనులకు భూమిపూజ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలోని రామాలయం ఏరియాలో 1, 2, 3 జోన్ల పరిధిలో సింగరేణి ఫండ్స్ రూ.4.09 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్​, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​ భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యోగులు, వారి కుటుంబాల సౌకర్యార్థం రోడ్లు నిర్మించేందుకు అవసరమైన ఫండ్స్​ మంజూరుకు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్​ చొరవచూపారన్నారు. ఏరియా సింగరేణి పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్, సివిల్​ఎస్ఈ జయప్రకాశ్, ఎస్ఎస్ఓ రవికుమార్​ తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది.

జైనథ్: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్​మండల కేంద్రంలో రూ.3.58 కోట్లతో నిర్మించే మినీ స్టేడియానికి భూమి పూజ చేసి శిలాపాలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోందన్నారు. ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, సర్పంచ్ దేవన్న తదితరులు పాల్గొన్నారు.