కరీంనగర్ టౌన్, వెలుగు : సిటీవాసులకు బల్దియా ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. శుక్రవారం స్థానిక సప్తగిరికాలనిలోని కోదండ రామాలయంలో రూ.26.5లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న
సిటీలో ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కమ్యూనిటీ హాల్స్ ఉపయోగపడతాయన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, వాల రమణారావు, బుచ్చిరెడ్డి, లీడర్లు రమేశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.