బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ శివారులో కేటాయించిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకే ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టులకు గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఇండ్ల స్థలాలు రానివారు నిరాశ చెందవద్దని కలెక్టర్‌తో చర్చించి అర్హులైన వారందరికీ స్థలాలు ఇచ్చేలా చూస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నాల గ్రామ సర్పంచ్ జిల్లపల్లి స్వరూప, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు రామ్ శెట్టి వల్లభాయ్, అధ్యక్షుడు పులియాల రాజు, జనరల్ సెక్రటరీ దాగం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.