యుఫోరియాలో భూమిక స్పెషల్ రోల్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ గుణ శేఖర్

యుఫోరియాలో భూమిక స్పెషల్ రోల్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ గుణ శేఖర్

దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం ‘యుఫోరియా’ అనే యూత్‌‌ఫుల్ సోషల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తవగా తాజాగా సెకండ్ షెడ్యూల్‌‌ షూటింగ్ స్టార్ట్ చేశారు.  ఈ క్రమంలో స్పెషల్ అప్‌‌డేట్ ఇచ్చారు. నటి భూమిక ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె సెట్స్‌‌కు రావడం మొదలు, మేకప్ వేసుకోవడం, షూటింగ్‌‌లో పాల్గొనటం లాంటివి చూపించారు.  

గతంలో గుణశేఖర్ తెరకెక్కించిన ‘ఒక్కడు’ చిత్రంలో మహేష్ బాబుకి జంటగా భూమిక నటించిన విషయం తెలిసిందే. దీంతో 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్‌‌ రిపీట్ అవుతోంది. భూమికను దృష్టిలో ఉంచుకుని గుణశేఖర్ ఓ పవర్‌‌‌‌ఫుల్‌‌ క్యారెక్టర్‌‌‌‌ను క్రియేట్ చేశారని సమాచారం. ఇంకా ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గ‌‌విరెడ్డి, లికితా య‌‌ల‌‌మంచిలి, అడ్డాల పృథ్వీరాజ్‌‌ తదితరులు నటిస్తున్నారు. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.