
మెదక్ (చేగుంట), వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటకు చెందిన భూంలింగం గౌడ్ కాంగ్రెస్‌లో జాయిన్అయ్యారు. శనివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్‌తో కలిసి గాంధీ భవన్‌కు వెళ్లిన ఆయనకు తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
భూంలింగం గౌడ్గతంతో బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. ఎన్నికల ముందు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కొన్నాళ్లకే మళ్లీ బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో జాయిన్అయ్యారు. చేగుంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్రాజేందర్రెడ్డి కూడా తన అనుచరులతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.