- మరో రెండు కమిషన్లకు ఛైర్మన్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్కమిషన్ చైర్మన్‌గా మండలి మాజీ ప్రొటెం చైర్మన్ వి.భూపాల్‌రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. పటానుచెరు నియోజకవర్గానికి చెందిన భూపాల్‌రెడ్డి 2021 జూన్ నుంచి 2022 జనవరి వరకు శాసన మండలికి ప్రొటెం చైర్మన్‌గా పనిచేశారు.కాగా.. ఫైనాన్స్ కమిషన్ మెంబర్లుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనెవట్లకు చెందిన మహ్మద్‌సలీం నియమితులయ్యారు.
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్కార్పొరేషన్ చైర్మన్ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లికి చెందిన మాటం భిక్షపతిని నియమించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కొడుకు మహ్మద్తన్వీర్ను నియమించారు. మూడు కార్పొరేషన్లకు నియమించిన చైర్మన్లు ఉమ్మడి మెదక్‌జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే వీరి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రాత్రి పొద్దుపోయే వరకు విడుదల చేయలేదు.