వచ్చే నెల 17న హాజరుకండి... కేసీఆర్​కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు

వచ్చే నెల 17న హాజరుకండి... కేసీఆర్​కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు

 

  • సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్​ స్మితా సబర్వాల్​కు కూడా
  • మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి 
  • సెప్టెంబర్​ 5న రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్​ సహా 8 మందికిసమన్లు జారీ చేసిన కోర్టు
     

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు:  బీఆర్​ఎస్​ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్​కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 17న తమ ముందు హాజరుకావాలని గురువారం నోటీసులు పంపింది. సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మితా సబర్వాల్​కు కూడా కోర్టు తరపున సమన్లు జారీ అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనిపై విచారణ చేయాలని కోరుతూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు వేశారు.

కేసీఆర్, స్మిత తప్ప మిగిలినవారి తరఫున అడ్వకేట్లు హాజరు

ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపిన కోర్టు

ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకున్న జిల్లా జడ్జి.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరిన విధంగా మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో పాటు 8 మందికి ఆగస్టు మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం  కేసు విచారణకు వచ్చింది. మాజీ మంత్రి హరీశ్​రావు తరపున న్యాయవాదులు లలితా రెడ్డి, సుకన్య.. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ మేఘా కృష్ణారెడ్డి, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రజత్ కుమార్, ఎల్ అండ్ టీ ఎండీ సురేశ్​ కుమార్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవధాని,  శ్రావణ్ రావు..  ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్లు హరిరామ్, శ్రీధర్ తరఫున వరంగల్  అడ్వకేట్ నరసింహారెడ్డి హాజరయ్యారు.

మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మితా సబర్వాల్​ తరపున న్యాయవాదులెవ్వరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో వచ్చే నెల 17కు కేసును వాయిదా వేస్తూ జిల్లా జడ్జి నారాయణబాబు ఉత్తర్వులిచ్చారు. గురువారం కోర్టుకు హాజరుకాని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మితాసబర్వాల్​సైతం అదే రోజు (ఈ నెల 17న) కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ మరోసారి సమన్లు జారీ చేశారు. 

న్యాయపోరాటం ఆగదు: రాజలింగమూర్తి

చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని పిటిషినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజలింగమూర్తి మీడియాతో అన్నారు. భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పారు.