ప్రజా సంక్షేమమే బీఆర్‌‌ఎస్‌‌ ఎజెండా : గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి, వెలుగు : ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే బీఆర్‌‌ఎస్‌‌ ఎజెండా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు వేదికలు కట్టించిన ఘనత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వానిదేనన్నారు.

విద్య, వైద్యం, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రజలు మరోసారి బీఆర్‌‌ఎస్‌‌కు అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, చిట్యాల ఏఎంసీ చైర్మన్‌‌ కొడారి రమేశ్‌‌, ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి, జడ్పీటీసీ జోరుక సదయ్య, నాయకులు నరసింగరావు, బల్గూరి తిరుపతిరావు, రాజేశ్వరరావు పాల్గొన్నారు.