
తన భర్త హత్యకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్, మాజీఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డే కారణమని ఆరోపించారు రాజలింగమూర్తి భార్య సరళ. భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. గండ్ర వెంకట రమణ రెడ్డిఈ హత్యకు తనకు సంబంధం లేదని చెప్పారు. ఇపుడు ఆయన ప్రధాన అనుచరుడే హత్యకు సూత్రదారుడిగా ఉన్నారని చెప్పారు. దీన్ని బట్టే హత్య వెనుక ఎవరెవరి హస్తం ఉందో అర్థమవుతుందన్నారు.
చిన్న భూమి తగాద విషయంలో తన భర్త హత్య జరగలేదన్నారు సరళ . భూమి విషయంలో హత్య జరిగితే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని కొత్త హరిబాబు ప్రమేయం ఎందుకు ఉందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కేసు వేసినందుకే తన భర్తను హత్య చేశారని ఆరోపించారు. తన భర్త హత్య కేసు నమోదు సమయంలో తాను ఇచ్చిన సమాచారం వేరు, పోలీసులు నమోదు చేసుకున్నది వేరని చెప్పారు. సీబిసిఐడి దర్యాప్తు బృందం చేత హత్య కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సరళ. గండ్ర వెంకటరమణా రెడ్డి, కొత్త హరిబాబులకు ఉరి శిక్ష వేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
Also Read : ప్లాన్ ప్రకారమే రాజలింగమూర్తి హత్య
ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో భూపాలపల్లి మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రధాన అనుచరుడు కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్లు ధృవీకరించారు. హరిబాబు ప్లాన్ ప్రకారమే రాజలింగమూర్తిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజలింగ మూర్తిని చంపితే బెయిల్ నేనే తీసుకొస్తా.. మీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటాని నిందితుడు హరిబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు 5 నెలలుగా పాటు ప్లాన్ల్చేసి, హత్య చేసిన్న ట్లు సమాచారం. ఈ కేసులో ఏ8గా ఉన్న హరిబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేస్తే ఇంకొన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.