మహాముత్తారం, వెలుగు : సర్కార్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించాలని భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం జడ్పీహెచ్‌ఎస్, బోర్లగూడెం ప్రైమరీ స్కూల్, మహాముత్తారం పీహెచ్‌సీ, పెగడపల్లి ఆశ్రమ స్కూల్‌ను శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్లకు పాఠాలు బోధించారు. ఆయన వెంట డీఈవో రాంకుమార్, డీఎంహెచ్‌వో మధుసూదన్, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, డాక్టర్ సందీప్ ఉన్నారు.