ప్రతి ఒక్కరూ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు  :  అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని భూపాలపల్లి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్యాండిడేట్ల ఖర్చు నమోదు, ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ అమలు వంటి విషయాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. క్యాండిడేట్లు తప్పనిసరిగా ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించాలని సూచించారు.

క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసిన రోజు నుంచి కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ రోజు వరకు చేసే ప్రతి ఖర్చును నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌ పనులు చేయవద్దని ఆదేశించారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ఫ్లెక్సీలపై ముద్రించేవారి ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ను తప్పనిసరిగా ప్రింట్‌‌‌‌‌‌‌‌ చేయాలని చెప్పారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘనలపై సీ విజిల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా గానీ, 1950 టోల్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ ద్వారా గాని ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉమా శంకర్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌, ఆడిట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శ్రవణ్‌‌‌‌‌‌‌‌, డీపీఆర్‌‌‌‌‌‌‌‌వో శ్రీధర్ పాల్గొన్నారు.

బార్డర్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు తనిఖీ

మహబూబాబాద్/మరిపెడ, వెలుగు :  మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లోని దంతాలపల్లి మండలం వేములపల్లి చెక్‌‌‌‌‌‌‌‌ పోస్టును శుక్రవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శశాంక పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు గమనించి ఆఫీసర్లు, సిబ్బందికి సూచనలు చేశారు. చెక్‌‌‌‌‌‌‌‌పోస్టు వద్ద తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని, వీడియో తీయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, డబ్బు, మద్యం, రవాణాను అరికట్టలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో నరసింహారావు, డీఎస్పీ జి.వెంకటేశ్వరబాబు, సీఐ సత్యనారాయణ ఉన్నారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు.

ఏ రోజు సీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన డబ్బులను ఆ రోజే కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌కు గానీ, పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌కు గాని తరలించి స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో భద్రపరచాలని సూచించారు. తగిన పేపర్స్‌‌‌‌‌‌‌‌ చూపని డబ్బులను బ్యాంకుల్లో భద్రపరచాలని చెప్పారు. అనంతరం మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో జోనల్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. మరిపెడలోని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.