గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుంట : గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  తనను గెలిపించిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని భూపాలపల్లి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ గండ్ర సత్యనారాయణరావు చెప్పారు. బుధవారం నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేసిన అనంతరం జిల్లా పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పేరుతో గెలిచిన వెంకటరమణారెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం కార్యకర్తలను నట్టేట ముంచి అధికార పార్టీలో చేరి, ఆస్తులను కూడగట్టుకున్నారని విమర్శించారు. తాను రెండు సార్లు ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని గుర్తు చేశారు. అధికార పార్టీ లీడర్లు ధన, అంగ బలంతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌తో పనిచేసి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ఐత ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కట్టంగూరి రాంనర్సింహారెడ్డి, గాదర్ల అశోక్​, చల్లూరి మధు ఉన్నారు.