కార్పొరేట్​కు దీటుగా సర్కారు వైద్యం

కార్పొరేట్​కు దీటుగా సర్కారు వైద్యం

రేగొండ/ శాయంపేట, వెలుగు: కార్పొరేట్​కు దీటుగా రాష్ర్ట ప్రభుత్వం సర్కారు దవాఖానలను తీర్చిదిద్దుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లిగోరి, హనుమకొండ జిల్లా శాయంపేట మండలాల్లో పర్యటించారు. తిరుమలగిరిలో పల్లె దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. 

శాయంపేట రైతు వేదికలో మండల సమాఖ్యకు రూ.కోటి 59 లక్షల 60 వేల వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని దళితకాలనీలో సన్నబియ్యం లబ్ధిదారులు మారెపల్లి బాబు–మాలత ఇంట్లో భోజనం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్​ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, డీఆర్డీవో మేన శ్రీను, ఆర్డీవో నారాయణ తదితరులు పాల్గొన్నారు.