సిరికొండ, వెలుగు: ప్రత్యేక రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆ పార్టీ రూరల్అభ్యర్థి భూపతిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సిరికొండ, కొండూర్తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన బాజిరెడ్డికి ఓటేసి మరోసారి మోసపోవొద్దని కోరారు.
అవినీతి పరులను, తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలన్నారు. చేతు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రచారంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావ్, పార్టీ మండలాధ్యక్షుడు రవి, లీడర్లు దేగం సాయన్న, సంజీవ్, రమేశ్, శ్రీనివాస్, మల్లేశ్ పాల్గొన్నారు.