గ్యారెంటీ స్కీమ్​లు అమలు చేస్తాం : భూపతి రెడ్డి

ఇందల్వాయి, వెలుగు : అధికారంలోకి రాగానే కాంగ్రెస్​పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్​లను అమలు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మండలంలోని జీకే తండా, డొంకల్, కొటాల్​పల్లి, డొంకల్​తండా, గౌరారం, లింగాపూర్​ గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ అన్నీ వర్గాల అభివృద్ధికి ఉపయోగపడేలా కాంగ్రెస్​గ్యారంటీ స్కీమ్​లు రూపొందించిందన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్​కాంగ్రెస్​ను విమర్శించడం హాస్యస్పదమన్నారు. వచ్చే ఎన్నకల్లో బీఆర్ఎస్​కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. మండలాధ్యక్షుడు నవీన్​ గౌడ్, లీడర్లు సంతోష్​ రెడ్డి, వెంకట్​రెడ్డి, రాజన్న, నరేశ్​పాల్గొన్నారు.