నిజామాబాద్‌రూరల్, వెలుగు : అధికార పార్టీ లీడర్లు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్విజయాన్ని అడ్డుకోలేరని మాజీ ఎమ్మెల్సీ, రూరల్ నియోజకవర్గ పార్టీఅభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ మండలం గుండారం, పాంగ్రా, ఆర్యానగర్, బోర్గాం, బ్యాంక్ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.
భూపతిరెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ, ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. అధికార బలంతో ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌రెడ్డి, లీడర్లు ముప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, యాదగిరి, రాజేందర్పాల్గొన్నారు.