![జోరుగా గోద్రెజ్ జెర్సీ పాల అమ్మకాలు](https://static.v6velugu.com/uploads/2022/03/Bhupendra-SuriCEO-Cream-Line-Dairy-Products-Ltd-said-that-milk-sales-in-Telangana-and-other-parts-of-the-country-are-reaching_w1O7uIAcqy.jpg)
హైదరాబాద్, వెలుగు: తెలంగాణతోపాటు, ఇతర ప్రాంతాలలోనూ పాల అమ్మకాలు ప్రీ కోవిడ్ లెవెల్‌కు చేరుతున్నట్లు క్రీమ్లైన్డెయిర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీఈఓ భూపేంద్ర సూరి చెప్పారు. విద్యాసంస్థల మూసివేతతో కోవిడ్ టైములో పాలు, ఇతర డెయిరీ ప్రొడక్టుల అమ్మకాలు బాగా తగ్గాయని, ఇప్పుడు ప్రీ కోవిడ్లెవెల్లో 95 శాతానికి చేరువయ్యాయని పేర్కొన్నారు. త్వరలో బిజినెస్‌లో మూడు నుంచి నాలుగు శాతం గ్రోత్ సాధించగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. గోద్రెజ్ జెర్సీ బ్రాండ్ పెరుగుకు హైదరాబాద్, తెలంగాణ మార్కెట్లలో మంచి ఆదరణ దొరుకుతోందని , ఈ సెగ్మెంట్లో తాము రెండంకెల గ్రోత్ సాధిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో టెట్రా ప్యాక్కెపాసిటీని మూడు రెట్లు పెంచుతున్నామని, ఇందుకోసం ఈ ఏడాది రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నామని సూరి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిపి డెయిరీ ప్రొడక్టుల మార్కెట్ విలువ రూ. 56 వేల కోట్ల దాకా ఉంటుందని వివరించారు.