యాదాద్రి, వెలుగు : భువనగిరి బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు క్యాంప్‌లోనే కొనసాగుతున్నారు. మున్సిపల్చైర్మన్ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యపై 16 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని గుంటూరుకు వెళ్లివచ్చిన వారు మంగళవారం ఉప్పల్‌లోని ఓ హోటల్లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అవిశ్వాసం తీర్మానంపై బుధవారం కలెక్టర్హనుమంతు జెండగేను కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డిని ఫోన్లో సంప్రదించి.. చైర్మన్ విషయంలో పార్టీకి ఉన్న అవకాశాలను వివరించారు. బుధవారం మరోసారి ఎమ్మెల్యేను కలువనున్నారు. కాగా, చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని సంప్రదించారని సమాచారం. పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటును వివరించగా.. తాను మాట్లాడుతానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.