యాదాద్రి, వెలుగు : లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్చేయడానన్ని బీజేపీ స్వాగతిస్తే .. బీఆర్ఎస్ ఖండించింది. శుక్రవారం బీజేపీ నేతలు భువనగిరిలో పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎంతటి వారైనా అరెస్ట్ కాక తప్పదని వారు అన్నారు.
కాగా, బీఆర్‌ఎస్ నేతలు కవిత అరెస్ట్‌ను ఖండించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి.. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.