- మూసీ నదిని ప్రక్షాళన చేసి టూరిజం స్పాట్‌గా మారుస్తాం
- పోచంపల్లి,రుద్రవెల్లి బ్రిడ్జి పనులకు 20 రోజుల్లో టెండర్లు
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌కు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి పేరు పెట్టేందుకు కృషి చేస్తామని ఆర్‌అండ్‌బీ,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం బీబీనగర్ మండలం మహాదేవపూర్‌లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు.తర్వాత మినీబస్టాండ్‌తో పాటు గూడూరు, కొండమడుగు గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలు, పశు వైద్య ఉప కేంద్రానికి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహదేవపూర్‌లోని ప్రాచీనవేణుగోపాలస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని,ఆలయం ముందు రోడ్డు పనులను శివరాత్రిలోగా కంప్లీట్ చేస్తామని తెలిపారు.మూసీ నదినిప్రక్షాళన చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. అందరి సహకారంతో తప్పకుండా ఇది చేసి తీరుతామన్నారు. పోచంపల్లి,రుద్రవెల్లి బ్రిడ్జి పనులకు 20 రోజులలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోఅభివృద్ధి పనుల కోసం రూ. 120 కోట్లు మంజూరు చేశామనివెల్లడించారు.
రూ. 1,124 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ది
బీబీనగర్ ఎయిమ్స్‌లో రూ. 1124 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇవి కంప్లీటైతే దేశంలోనే బెస్ట్ ఆస్పత్రిగా నిలిచిపోతుందని మంత్రి చెప్పారు.భువనగిరిలో రూ. 200 కోట్లతో 10 ఎకరాల స్థలంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని,రూ.100 కోట్లతో భువనగిరి ఖిల్లా రోప్ వే పనుల కోసం డీపీఆర్ సిద్ధమైందని, త్వరలోనేటెండర్లను పిలుస్తామని చెప్పారు.కొండమడుగు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ. 60 లక్షలు ఇచ్చిన దాత చక్రధరరావును మంత్రి అభినందించారు. ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికేరెండు అమలు చేశామని, మిగితావి 100 రోజుల్లో అమలు చేస్తామని మాటిచ్చారు. ప్రతి గ్రామానికి 100 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.
పరిశ్రమల పొల్యూషన్ కంట్రోల్ చేయండి..
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ జోన్‌ను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చడంతో పాటు బీబీనగర్‌లో పరిశ్రమల పొల్యూషన్ నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.కస్తూర్భా స్కూళ్లలోవసతులు కల్పిస్తామని తెలిపారు. పోచంపల్లి, గోకారం, జూలూరు, పోచంపల్లి,బొల్లెపల్లి, సంగెం, అనాజిపురం బ్రిడ్జిలు, బీబీనగర్, మక్తఅనంతారం రోడ్ల పనులు చేపడుతామని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,కలెక్టర్ హనుమంతు జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర, అడీషినల్ కలెక్టర్ జీ వీరారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి,జడ్పీటీసీ ప్రణీత పింగళి రెడ్డి,ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.