యాదాద్రి, వెలుగు : షేర్మార్కెట్కోసమే గుజరాత్మోడల్ఎగ్జిట్పోల్స్రిలీజ్ చేశారని, వాస్తవ ఫలితాలతో మార్కెట్లో ఎంతోమంది నష్టపోనున్నారని భువనగిరి కాంగ్రెస్అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎగ్జిట్ పోల్‌ను చూపించి కొందరు తామే గెలుస్తున్నామని చెప్పుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రజల ఆశీర్వాదంతో భువనగిరిలో తను 1.50 లక్షల ఓట్లతో గెలుస్తున్నానని చెప్పారు. భువనగిరితోపాటు గెలిచే మరో 12 కు పైగా సీట్లతో ఈ ఎగ్జిట్పోల్స్తప్పని తేలిపోతుందన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. దీంతో బీజేపీకి కొన్ని బీఆర్ఎస్ఓట్లు ట్రాన్స్ఫర్అయ్యాయని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎంత చెప్పినా.. విప్లవ స్ఫూర్తి కలిగిన భువనగిరి ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలవరని తెలిపారు. ఎంపీగా గెలిచిన తర్వాత భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆయన వెంట భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్కుమార్ఉన్నారు.