ఉద్యోగాలడిగితే దూషించడమేంటి? : కుంభం అనిల్ కుమార్

  • కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి కుంభం 

యాదాద్రి, వెలుగు : ఉద్యోగాలు ఏమయ్యాయని యువత ప్రశ్నిస్తే వారిని మంత్రి కేటీఆర్​ దూషించడం సరికాదని కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ మండిపడ్డారు.  సోమవారం భూదాన్​ పోచంపల్లి, భువనగిరి మండలాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ లీడర్ల మాటలకు హద్దు అదుపు లేకుండా పోయిందని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి ఓడిపోతున్నారని తెలిసే  ఆయనను ఓదార్చేందుకు కేటీఆర్​ వచ్చారని ఎద్దేవా చేశారు.

 బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ఆ పార్టీ కార్యకర్తలకు తప్ప అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పార్టీలకతీతంగా పేదలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని,  యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని  మాటిచ్చారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను నమ్మి మోసపోకుండా కాంగ్రెస్‌‌‌‌కు ఓటేయాలని కోరారు. అనంతరం వివిధ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌‌‌‌లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు.