- కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
యాదాద్రి, వెలుగు : ఎంపీగా ఉన్న సమయంలో బూర నర్సయ్యగౌడ్ తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భువనగిరి కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తెచ్చానని చెప్పుకుంటున్న రూ.9 వేల కోట్లు ఏఏ పనులకు ఖర్చు చేశారో బూర చెప్పాలన్నారు. తన వ్యాపారం కోసం ఎయిమ్స్రాకుండా చేసేందుకే ఆయన ప్రయత్నించారని ఆరోపించారు.
2014 విభజన చట్టం ప్రకారం ఎయిమ్స్వచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో కులం, మతం అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా ఉన్నప్పుడు నిధుల సాధన కోసం ఎన్నడూ ప్రయత్నం చేయలేదన్నారు. తెలంగాణ సొమ్మును కేసీఆర్ దోచుకుంటుంటే.. ప్రధాని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని
గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేస్తానని తెలిపారు. ఆయన వెంట భువనగిరి మున్సిపల్‌చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నాయకుడు తంగెళ్ల పల్లి రవికుమార్ తదితరులు ఉన్నారు.