సీఆర్ పాటిల్ పై ఎంపీ చామల ఫిర్యాదు

ఎల్బీనగర్, వెలుగు: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫొటో మార్ఫింగ్ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కలిసి శనివారం హయత్ నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. బీజేపీ గుజరాత్ ‘ఎక్స్’ ఖాతాలో ఈ మార్ఫింగ్ ఫొటోను పోస్టు చేశారని పేర్కొన్నారు. సీఆర్ పాటిల్ సూచనలతోనే ఇలా చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.