ఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగు : కుంభం అనిల్​కుమార్​రెడ్డి

  • కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని  ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​రెడ్డి అన్నారు.  బుధవారం భువనగిరి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి ఆరు గ్యారంటీలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా నియోజకవర్గంలోనే ఉండి  ప్రజా సమస్యల పరిష్కరానికి పోరాటం గుర్తు చేశారు. తాను గెలిచిన వెంటనే బైపాస్​రోడ్డుపై రామకృష్ణాపురం వెళ్లడానికి అండర్​ పాస్​ నిర్మాణం చేయిస్తానని ప్రకటించారు.  

కాంగ్రెస్​ హయాంలో చేపట్టిన పనులను  తామే  చేపట్టినట్టుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. బీఆర్‌‌ఎస్‌ మోసపూరిత హామీలు నమ్మి బతుకులు ఆగం చేసుకోవద్దని, పేదలకు అండగా ఉండే కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు. భువనగిరి మండలంలోని రెడ్యానాయక్ తండా, పీబీ తండా, ఆకుతోటబావి తండా, సూరేపల్లి లో  కుంభం కిరణ్ జ్యోతి, మున్సిపాలిటీలో కుంభం కీర్తి ప్రచారం నిర్వహించారు.