- భువనగిరి బాలికల సూసైడ్ కేసులో ట్విస్ట్
- విద్యార్థినుల మృతదేహాలపై గాయాలు
- ఆరుగురిపై కేసు నమోదు
- పోలీసుల అదుపులో వార్డెన్, ఆటో డ్రైవర్
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి హాస్టల్‌లో బాలికలు భవ్య , వైష్ణవి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. విద్యార్థినుల మృతదేహాలపై గాయాలున్నట్టు బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులది హత్యనా లేక ఆత్మహత్యనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల లీడర్లు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది.
తమ పిల్లలను కావాలనే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా బాలికల ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటోడ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచన, పీఈటీ ప్రతిభ, టీచర్ భువనేశ్వరిపై పోలీసులు కేసు నమోదు చేశారు . ఇప్పటికే హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వార్డెన్ శైలజ, ఆంజనేయులును విచారిస్తున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యతో హాస్టల్ ఖాళీ అయింది.