- ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
- ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి భువనగిరి తొలి వేదిక కానుంది. సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్
హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి సభ కావడంతో విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భువనగిరి నియోజవర్గంలోని భూదాన్ పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, భువనగిరి మండలాలతో పాటు భూదాన్ పోచంపల్లి, భువనగిరి మున్సిపాలిటీల నుంచి 50 వేల మందికి పైగా జనాలను సమీకరిస్తున్నారు.
వేదిక సిద్ధం
భువనగిరి ప్రభుత్వ కాలేజీ ఆవరణలో ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికమీద100 మందికి పైగా కూర్చునేలా సీటింగ్‌తో పాటు మహిళలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సహ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఆదివారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
హ్యాట్రిక్ కొడుతం: పైళ్ల శేఖర్ రెడ్డి
రాష్ట్రాన్ని విధాలుగా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ను మూడోసారి సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయనకు సీఎం కేసీఆర్ భీపామ్ అందించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, స్టేట్ లీడర్ చింతల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు.