భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ కి కంచుకోట : భట్టి విక్రమార్క

 భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ కి కంచుకోటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి మంచి మెజారిటీ వచ్చిందని చెప్పారు. వరుణుడు కూడా వర్షపు జల్లుతో ఆశీర్వదించాడని తెలిపారు. గతంలో ఆగిపోయిన పథకాలు అన్నింటిని కొనసాగిస్తామని వెల్లడించారు. రూ.7 వేల 624 కోట్లు రైతులకు ఇవ్వాలని భావించామని రైతుల ఖాతాలో నగదు జమ చేద్దాం అనుకుంటే కొంతమంది ఫిర్యాదులు చేశారని చెప్పారు.

 ఈసీ ఆదేశాలు వలన రైతుల ఖాతాలో నగదు జమ చేయలేకపోయామని తెలిపారు.  చౌటుప్పల్  మున్సిపాలిటీ కేంద్రంలోని  కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ  బీజేపీ, బీఆర్ఎస్ చెప్పే అసత్య ప్రచారాలను నమ్మకండని సూచించారు. 

బీజేపీ, బీఆర్ఎస్ లకి ఒకటి రెండు సీట్లు వస్తే నయమేనని అన్నారు. కాంగ్రెస్ కి 14 సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే మరమ్మతులు చేస్తున్నారని విద్యుత్ కి అంతరాయం లేకుండా చూస్తున్నామని తెలిపారు భట్టి విక్రమార్క