యాదాద్రి, వెలుగు : అభివృద్ధి ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలోని జిల్లా ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో రెండో అంతస్తు నిర్మాణం, ఐసీయూ బ్లాక్ఏర్పాటు పనులు, ప్రగతినగర్‌లో రూ.21.80 కోట్లతో చేపట్టే నీటి సరఫరా పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రూ.వంద కోట్లు తీసుకొస్తానని చెప్పారు. నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
భువనగిరి కోటను రూ.118 కోట్లతో రోప్‌వే శాంక్షన్ అయిందని, రూ.68 కోట్లు విడుదల అయ్యాయన్నారు. ఈ సందర్భంగా భువనగిరి జిల్లా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, స్టేట్ మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీ సురేంద్రమోహన్, కలెక్టర్హనుమంతు జెండగే, అడిషనల్ కలెక్టర్గంగాధర్, ఆర్డీవో అమరేందర్, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, కౌన్సిలర్ అవంతిక క్రాంతి, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మనోహర్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.