
భూదాన్ పోచంపల్లి, వెలుగు: తాము అభివృద్ధి చేసి, చూపిస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూ.11.60 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతీ గ్రామానికి రోడ్డు వేస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట బ్రిడ్జీలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హలందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 47 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.