మూసీపై రాజకీయం చేయొద్దు: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: మూసీపై బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ నడుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ‘కిషన్ రెడ్డి .. మా ఛాలెంజ్ ఒక నైట్ కాదు మూడు నెలలు. మూసీ అనేక వర్గాల సమస్య..  దశాబ్దాల నుంచి మూసీ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. దీనిపై బీజేపీ రాజకీయం చేయొద్దు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల ను కేటాయిస్తున్నం. సబర్మతి కోసం మీ ప్రభుత్వం వేలాది మందిని ఖాళీ చేయించలేదా? ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముందు కిషన్ రెడ్డి పడుకొని మూసీ ప్రక్షాళనకు నిధులు తీసుకురావాలి’ అని సూచించారు.