అండర్​ పాస్​లు ఏర్పాటు చేయండి : కుంభం అనిల్ ​కుమార్​ రెడ్డి

  •     మంత్రిని కోరిన ఎమ్మెల్యే కుంభం అనిల్ ​కుమార్​ రెడ్డి 

యాదాద్రి, వెలుగు : వరంగల్, విజయవాడ హైవేలపై అండర్​ పాస్​లు ఏర్పాటు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి కోరారు. ఆర్​ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో భువనగిరి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. వరంగల్​ హైవేపై అండర్​ పాస్​లు లేక రామక్రిష్ణాపురం, సింగన్నగూడెం, కొండమడుగు, విజయవాడ హైవేపై కొత్త గూడెం వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

నియోజకవర్గంలోని చిట్యాల రోడ్డు, రుద్రవెళ్లి బ్రిడ్జీ పనులు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు హెచ్​ఎండీఏ కమిషనర్​ సర్పరాజ్​అహ్మద్​ను ఎమ్మెల్యే కుంభం కలిశారు. భువనగిరి టౌన్​లోని రోడ్లను సుందరీకరించాలని కోరారు.

పోచంపల్లి, బీబీనగర్, భువనగిరిలోని చెరువుల వద్ద గతంలో చేపట్టిన మినీ ట్యాంక్​ బండ్​ పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం మూసీ రీవర్​ ఫ్రంట్​ఎండీ అమ్రపాలిని కలిసి మూసీ ప్రక్షాళన పనులు చేపట్టాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించారు.