గాంధీ ఫోటోపై భువనగిరి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

యాదాద్రి, వెలుగు: రిపబ్లిక్​ డే సెలబ్రేషన్స్​ టైమ్​లో  గాంధీ ఫొటో పెట్టాల్సిన అవసరం లేదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ‘కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి’ నిర్వహించిన జ్ఞానయుద్ధ సభలో అంబేద్కర్​కు జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అంబేద్కర్​ కారణంగానే గణతంత్ర దినోత్సవం రోజు మనం జెండా ఎగురవేస్తున్నామన్నారు. అలాంటప్పుడు గాంధీజీ ఫొటో అవసరం లేదన్నది కరెక్టే. కానీ గాంధీజీతో పాటు అంబేద్కర్​ ఫొటో పెట్టాల్సిన అవసరం వంద శాతం ఉంది అని చెప్పారు. తప్పకుండా ఈసారి అన్ని  ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో అంబేద్కర్ ఫొటో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్​ ఫొటో పెట్టాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్​తో తాను మాట్లాడుతానని చెప్పారు.