యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అనంతారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని దళితులు అడ్డుకున్నారు. దళిత బంధు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
పక్క గ్రామానికి దళిత బంధు ఏవిధంగా ఇచ్చారని అనంతారం గ్రామానికి కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ గ్రామం ఏం పాపం చేసిందని నిలదీశారు. దళితులు నిలదీయడంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత అనంతారం గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నెలకొంది.