- ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
చేర్యాల,వెలుగు: డాక్టర్లు గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీసీ కమిషన్ మెంబర్ రంగు బాలలక్ష్మి తో కలిసి శ్రీ రాజరాజేశ్వర సీటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . గ్రామీణ ప్రజలు ఎంతో కష్టంగా హైదరాబాద్, సిద్ధిపేట లాంటి ఆసుపత్రులకు వెళ్తున్నారని ఈ నేపథ్యంలో అత్యాధునిక పరికరాలతో ఆసుపత్రిని ఏర్పాటుచేయడం శుభపరిణామమని అన్నారు.
పేద ప్రజల కోసం డాక్టర్లు గ్రామాలో పనిచేస్తే వారికి ప్రజల అండదండలుంటాయన్నారు. ఈ సందర్బంగా సెంటర్ ను ఏర్పాటు చేసిన అక్షర హాస్పిటల్ డాక్టర్ సంతోష్ కుమార్ ను అభినందించారు. కాంగ్రెస్ నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.