యాదాద్రి(బీబీనగర్), వెలుగు : పేదలకు వైద్య సేవలు అందించే ఎయిమ్స్అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను ఆయన సందర్శించారు. ఎయిమ్స్‌లోని బ్లడ్ బ్యాంక్, ప్రయోగశాల, హాస్పిటల్ బిల్డింగ్తోపాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను పరిశీలించారు. మెడికల్ కాలేజ్ పరిపాలన హాస్పిటల్స్ సర్వీసెస్ అకాడమిక్స్ గురించి డైరెక్టర్వికాస్ భాటియాను అడిగి తెలుసుకున్నారు.
ఎయిమ్స్‌లో సేవలు అందించేవారిని ఔట్‌సోర్సింగ్‌లో ఏ విధంగా నియమించుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఔట్ పేషెంట్విభాగంలోకి వెళ్లి వారితో మాట్లాడారు. అనంతరం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎయిమ్స్‌లో పూర్తి స్థాయిలో సేవలు అందించే విధంగా తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్హనుమం జెండగే, నాయకులు ఉన్నారు.