- అల్రెడీ కవిత జైలుకెళ్ళి వచ్చింది
- తెలంగాణలో సానుభూతితో ఓట్లు రావు
- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
భువనగిరి: అరెస్ట్ అయితే రేటింగ్ పెరుగుతుందని కొందరు నేతలు భావిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పుష్ప2 కలెక్షన్స్ రూ. 100 నుంచి 150 కోట్లు పెరిగినట్టు టాక్ వచ్చిందని తెలిపారు.
ALSO READ | లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో పట్నంతో పాటు 24 మందికి బెయిల్
కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే పుష్ప3 రేంజ్ లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ తెలంగాణలో సానుభూతితో ఓట్లు రావని గుర్తుచేశారు. ఝూర్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టు అయినప్పుడు ప్రజల సానుభూతి లభించిందని, కానీ బీఆర్ఎస్ కు అలా జరగదనని తెలిపారు.
కేసీఆర్ నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొందని, కవిత ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చింది. కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి వస్తే మైలేజ్ పెరుగుతుందని అనుకుంటున్నారని చెప్పారు.