గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్

గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్
  • గ్రూప్ –1లో 1:100 తో టెక్నికల్ సమస్యలు
  • క్యాలెండర్ ఇస్తం. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ  
  • ఆందోళనలు చేయొద్దు.. డీఎస్సీ రాయండి
  •  నిరుద్యోగులతో భేటీలో ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి
  • అన్ని అంశాలను సీఎంకు తెలుపుతామన్న కాంగ్రెస్ నేతలు
  • గ్రూప్ –2 డిసెంబర్ కు వాయిదా వేయాలన్ని నిరుద్యోగులు
  • బేగంపేట హరిత ప్లాజాలో కొనసాగుతున్న మీటింగ్

హైదరాబాద్: గ్రూప్–2 వాయిదా వేసే యోచనలో సర్కారు ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇవాళ బేగంపేటలోని హరిత ప్లాజాలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రె స్ నాయకులు నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రూప్–2, గ్రూప్–1, డీఎస్సీ నిర్వహణలో డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 లో 1:100 చొప్పున మెయిన్స్  కు పిలవాలని కోరగా.. అది సాధ్యం కాదని, టెక్నికల్ గా ఇబ్బందులు వస్తాయని అన్నారు.

 గ్రూప్–2ను నవంబర్ లేదా డిసెంబర్ నెలకు వాయిదా వేయాలన్న నిరుద్యోగుల విజ్ఞప్తికి సర్కారు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని చామల చెప్పారు. నిరుద్యోగులు ఆందోళనలు చేయవద్దని చక్కగా ప్రిపేర్ అయి డీఎస్సీ రాయాలని కోరారు. ప్రతి  ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ  ఉంటుందని చెప్పారు. నిరుద్యోగుల డిమాండ్లను సీఎంకు తెలుపుతామని చెప్పారు.