- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రుణమాఫీ విషయంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధాని మోదీ అబద్ధాలు, నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ అన్నారు. పంట రుణమాఫీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై ‘ఎక్స్’లో చామల స్పందించారు. మోదీ అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని, రుణమాఫీ విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కనీసం ఒక రాష్ట్రంలోనైనా గెలవాలన్న ఉద్దేశంతో మోదీ ఇలాంటి అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.