- ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్సర్కారుతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. అందుకోసమే సర్కారు బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ కమిషన్చైర్మన్జీ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, బాలలక్ష్మి, సురేందర్ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని ప్రస్తావించారు. ఇచ్చినమాట నిలబెట్టుకుంటామని చెప్పారు.
బీసీ కమిషన్ కూర్పులో భువనగిరి పార్లమెంట్‌కు పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్పరిధిలోని మునుగోడు నియోజకవర్గం నుంచి రాపోలు జయప్రకాశ్, జనగామ నుంచి రంగు బాలలక్ష్మిని మెంబర్లుగా నియమించారని తెలిపారు. వీరిద్దరూ అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారని చెప్పారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నాయకుడు పోత్నక్ ప్రమోద్‌కుమార్ ఉన్నారు.