పొల్యూషన్​ కంట్రోల్​ చేయని కంపెనీలకు తాళం వేస్తాం 

పొల్యూషన్​ కంట్రోల్​ చేయని కంపెనీలకు తాళం వేస్తాం 

భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : రెండు నెలల్లో పొల్యూషన్​ కంట్రోల్ ​చేయని ఫార్మా కంపెనీలకు తాళం వేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి జిల్లా భూదాన్​ పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెంలోని ఫార్మా కంపెనీలను ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి, కలెక్టర్ హనుమంతు జెండగే, పొల్యూషన్​కంట్రోల్ బోర్డు ఆఫీసర్లతో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇక్కడి వాటర్​తో పంటలు పండించలేని పరిస్థితిలో ఉందని పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీల కారణంగా గ్రౌండ్ వాటర్​తోపాటు గాలిలో పొల్యూషన్ పెరిగిపోయిందని గుర్తించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న పొల్యూషన్ గురించి పర్యావరణశాఖ మంత్రికి వివరించినట్టు తెలిపారు.

పొల్యూషన్ తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని గతంలోనే ఈ కంపెనీలను హెచ్చరించిన వారు పట్టించుకోవడంల లేదన్నారు. ఆ కంపెనీలకు రెండు నెలలు టైం ఇస్తున్నానని, ఆలోగా  పొల్యూషన్ ను కంట్రోల్​ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.