యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహలక్ష్మి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తూ అసలైన లబ్ధిదారులను మోసం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. బుధవారం తుర్కపల్లి మండలానికి చెందిన రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమ్మిరిశెట్టి నర్సింహులు, సీనియర్ నేతలు పంగాల కిష్టయ్య, మాలోతు విఠల్, ఓంకార్ గౌడ్, కన్నెబోయిన చంద్రయ్య, స్వాతి, సంతోశ్‌తో పాటు 100 మంది బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రౌండ్ లెవల్‌లో గట్టిగ పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఆలేరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సూచించారు. హైకమాండ్ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు బీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు వివరించాలని సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య, డీసీసీ ప్రెసిడెంట్ అండెం సంజీవరెడ్డి, ఎంపీటీసీలు మోహన్ బాబు నాయక్, శ్రీనివాస్ యాదవ్, నేతలు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, చాడ భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్, భాస్కర్ నాయక్, రామగోని వెంకటేష్ గౌడ్, ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, రాజారాం ఉన్నారు.