ఎంబీబీఎస్​ స్టేట్ ​ర్యాంకర్​కు భువనగిరి ఎంపీ చేయూత 

  • ఫీజు భరించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత
  • రూ.లక్షా 50 వేలు ఇచ్చిన ఇజ్రాయిల్​ తెలంగాణ అసోసియేషన్​

నిజామాబాద్,  వెలుగు : యూ ట్యూబ్ లో వీడియో క్లాసులు విని ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించిన ఇందూరు విద్యార్థిని హారిక మెడిసిన్ కు అయ్యే ఖర్చును తాము భరిస్తామని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేర్వేరుగా హామీ ఇచ్చారు. హారిక పీజీ చదివేంతవరకు  ప్రతీక్​ ఫౌండేషన్​ఆర్థిక సహాయం చేస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించగా, ఈనెల 11న ఫీజుకు సంబంధించిన చెక్​ను అందజేయనున్నట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. వీరితో పాటు ఇజ్రాయిల్​ తెలంగాణ అసోసియేషన్​ ప్రతినిధులు సోమరవి, దూడ రవి నేతృత్వంలో రూ.లక్షా 50 వేలు, ఎన్ఆర్ ఐ లక్ష్మారెడ్డి రూ. 50 వేలు ఆర్థిక సహాయం చేశారు. మరికొంతమంది దాతలు, సంస్థలు రూ.లక్షా 55 వేలను ఫోన్​ పే, గుగూల్​ పే ద్వారా పంపించారు.