బాలికల ఆత్మహత్యపై ఏకకాలంలో దర్యాప్తు

బాలికల ఆత్మహత్యపై ఏకకాలంలో దర్యాప్తు
  •     స్టేట్​ ఎంక్వైరీ ఆఫీసర్​గా లక్ష్మీదేవి, జిల్లా ఆఫీసర్​గా నాగలక్ష్మి

యాదాద్రి, వెలుగు : ఇద్దరు టెన్త్​ స్టూడెంట్ల ఆత్మహత్యపై ఏకకాలంలో దర్యాప్తు మొదలైంది. పోలీసులు ఒకవైపు ఎంక్వయిరీ కొనసాగిస్తుండగా.. జిల్లాలో శాఖాపరమైన దర్యాప్తు కూడా మొదలైంది. స్టేట్​ లెవెల్​లో ఎంక్వైరీ ఆఫీసర్​గా మహిళా శిశు సంక్షేమ జాయింట్​ డైరెక్టర్​ కేఆర్ఎస్​ లక్ష్మీదేవిని నియమిస్తూ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా ఎంక్వయిరీ ఆఫీసర్ గా స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​ నాగలక్ష్మిని నియమించారు. మరోవైపు హాస్టల్​ వార్డెన్​ శైలజపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఈనెల 3 రాత్రి భువనగిరి ఎస్సీ హాస్టల్ లో టెన్త్  స్టూడెంట్లు​ కోడి భవ్య, గాదె వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మూడు రోజులు గడిచినా బాలికల సూసైడ్​కు కారణాలు ఇంకా వెల్లడించలేదు. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. రోజురోజుకు అనుమానాలు పెరుగుతుడడంతో ఈ సంఘటనపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో శాఖాపరమైన దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. కాగా, బాలికలు ఆత్మహత్య చేసుకున్న స్థలంలో లభ్యమైనట్టు చెబుతున్న సూసైడ్​ లెటర్​ను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పోలీసులు పంపించారు. లెటర్​తో పాటు స్టూడెంట్ల నోట్​ బుక్స్​ను కూడా పంపించారు.

ALSO READ : ముంచుకొస్తున్న తాగునీటి గండం